కలం, వెబ్ డెస్క్ : టీ20 వరల్డ్ కప్ 2026కు ఇంగ్లండ్ రెడీ అయింది. వరల్డ్ కప్ కోసం పురుషుల జట్టును ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) 15 మందితో ప్రకటించింది. ఈ జట్టుతో పాటు, శ్రీలంకతో జరగనున్న మూడు వన్డేలు, మూడు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల కోసం కూడా జట్టును వెల్లడించింది. వైట్‌బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తొలిసారిగా ఐసీసీ టోర్నమెంట్‌లో ఇంగ్లాండ్ జట్టు (England Team) కు కెప్టెన్సీ వహించనున్నారు. గాయాల నుంచి కోలుకుంటున్న జోఫ్రా ఆర్చర్ జట్టులో చోటు దక్కించుకోగా, గత ప్రపంచకప్‌లో పాల్గొన్న జోస్ బట్లర్, సామ్ కరన్, బెన్ డకెట్, విల్ జాక్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్‌ను కొనసాగించారు.
నాల్గో అషెస్ టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన జోష్ టంగ్ను తొలిసారిగా టీ20 అంతర్జాతీయ జట్టులోకి వచ్చాడు. 2010, 2022 ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ జట్టు (England Team), ఫిబ్రవరి 8న నేపాల్‌తో తమ ప్రపంచకప్ గేమ్ ను ప్రారంభించనుంది. ఈ టోర్నమెంట్‌కు భారత్–శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
టీ20 ప్రపంచకప్ జట్టు
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రేహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జేకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.
శ్రీలంకతో వన్డే సిరీస్‌కు జట్టు
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రేహాన్ అహ్మద్, టామ్ బాంటన్, జేకబ్ బెథెల్, జోస్ బట్లర్, బ్రైడన్ కార్స్, జాక్ క్రాలీ, సామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జో రూట్, ల్యూక్ వుడ్.
Read Also: బిగ్ బ్యాష్ నుంచి షాహిన్ అఫ్రిది ఔట్
Follow Us On: Youtube


