కలం, వెబ్ డెస్క్ : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒత్తిడి ప్రతి ఒక్కరి సమస్యగా మారింది. ఉద్యోగం, జీవనశైలి, ఆర్థిక సమస్యలు ఇలా కారణం ఏదైనా ఒత్తిడి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ ఒత్తిడి ని తగ్గించుకోవడానికి (Stress Reduce) చాలా మార్గాల్లో ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్ కార్టిసాల్‌ను తగ్గించడం అంత ఈజీ కాదు. ఇది కేవలం ఔషధాలు వాడితే నియంత్రణలోకి రాదు. ఔషధాలతో పాటు మన జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఈ కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) స్థాయిలు పెరగడం వల్ల శరీరంలో వాపు, ఆందోళన, అలసట వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాగా కొన్నింటిని రోజువారీ అలవాట్లుగా మార్చుకోవడం ద్వారా కార్టిసాల్ స్థాయిలను సహజంగా కంట్రోల్ చేయొచ్చని, తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణురాలు డా. నిమర్జీత్ అంటున్నారు. ఆమె సూచించిన సులభమైన ఇంటి చిట్కాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌లో డా.నిమర్జీత్ ఇలా వివరించారు. “ఉదయం లేచిన వెంటనే రెండు నిమిషాలు శ్వాసాభ్యాసం చేయడం ద్వారా నర వ్యవస్థ ప్రశాంతమవుతుంది. కాఫీని వెంటనే తాగకుండా ముందుగా నీరు తాగాలి. సముద్ర ఉప్పు కలిపిన నిమ్మరసం హైడ్రేషన్‌కు మంచిది. అల్పాహారాన్ని ఎప్పుడూ మానేయకూడదు. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఉన్న సమతుల్య అల్పాహారం తీసుకోవాలి,” అని ఆమె సూచించారు. అలాగే రోజూ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్(EFT) చేయాలని, శరీరంలోని కొన్ని ఉప-మెరిడియన్ పాయింట్లపై తట్టడం ద్వారా వాపు తగ్గి ఎండార్ఫిన్స్ విడుదలవుతాయని తెలిపారు. కఠినమైన వ్యాయామాల కంటే శరీరాన్ని శాంతింపజేసే సోమాటిక్ వర్కౌట్స్ చేయడం మంచిదని సూచించారు.
డీప్, స్లో బ్రీతింగ్ టెక్నిక్ అనేది పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్‌ను ఉత్తేజితం చేస్తుందని తెలిపారు. ఇది “ఫైట్-ఆర్-ఫ్లైట్” స్పందనకు విరుద్ధంగా శరీరాన్ని విశ్రాంతి స్థితికి తీసుకెళ్తుందని చెప్పారు. “శ్వాసను నెమ్మదిగా తీసుకోవడం వల్ల మెదడుకు కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించాలనే సంకేతం వెళ్తుంది. దీనిని నిరంతరం చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా మారి ఆందోళన తగ్గుతుంది” (Stress Reduce) అని ఆమె వివరించారు.
కాఫీ కన్నా ముందు నీరు తప్పనిసరి
కాఫీ సహజంగా మూత్ర విసర్జనను పెంచే గుణం కలిగి ఉంటుందని డా.చటర్జీ తెలిపారు. తగినంత నీరు తాగకుండా ఎక్కువ కాఫీ తీసుకుంటే డీహైడ్రేషన్‌కు దారితీయవచ్చని చెప్పారు. అందుకే కాఫీకి ముందు, తరువాత నీరు తాగడం ద్వారా క్యాఫీన్ ప్రభావాన్ని సమతుల్యం చేయవచ్చన్నారు. గోరువెచ్చని నిమ్మరసంలో కొద్దిగా సముద్ర ఉప్పు కలపడం వల్ల హైడ్రేషన్ మెరుగవుతుందని, నిమ్మలోని పొటాషియం, ఉప్పులోని సోడియం కలిసి ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడతాయని తెలిపారు.
సమతుల్య అల్పాహారం
సమతుల్య అల్పాహారం కార్టిసాల్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందని డా. చటర్జీ పేర్కొన్నారు. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ కలిగిన ఆహారం రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులను నియంత్రించి, ఇన్సులిన్ పెరుగుదలను తగ్గిస్తుందని చెప్పారు. ప్రోటీన్ డోపమిన్, సెరోటొనిన్ ఉత్పత్తికి సహాయపడుతుందని, ఆరోగ్యకరమైన కొవ్వులు వాపును తగ్గిస్తాయని, ఫైబర్ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచి వాపు నివారణకు దోహదపడుతుందని వివరించారు. మొత్తంగా, సరైన ఉదయపు అలవాట్లు, సమతుల్య ఆహారం పాటించడం ద్వారా కార్టిసాల్ స్థాయిలను నియంత్రించి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also: బీ అలర్ట్.. పబ్లిక్ ప్లేసుల్లో ఫ్రీ వైఫై వాడుతున్నారా!
Follow Us On: Instagram


