కలం, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న భారీ చిత్రం మన శంకర్ వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu). ఫ్లాప్ అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తున్న అనిల్ రావిపూడి నుంచి వస్తున్న మూవీ కావడంతో మరింత క్రేజ్ పెరిగింది. ఇందులో చిరుకు జంటగా అందాల తార నయనతార నటిస్తుంది. ఇప్పటి వరకు రెండు పాటలను రిలీజ్ చేశారు. ఆ రెండు పాటలు కూడా యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతున్నారు. ఇప్పుడు చిరు, వెంకీల పై చిత్రీకరించిన సాంగ్ విడుదల చేశారు.
ఇది పక్కా మాస్ సాంగ్. చిరు, వెంకీ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారని తెలిసినప్పటి నుంచి అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తుండడం ఈ సాంగ్ వేరే లెవల్లో ఉండడంతో సినిమా పై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. కాసర్ల శ్యామ్ (Kasarla Shyam) అందించిన క్యాచీ లిరిక్స్.. భీమ్స్(Bheems) అందించిన మాస్ ట్యూన్స్ కలిసి ఈ సాంగ్ చిరు, వెంకీ అభిమానులకే కాదు.. కామన్ ఆడియన్స్ కు కూడా ఫీస్ట్ లా ఉంటుందనే ఫీలింగ్ క్రియేట్ చేసింది. ఇందులో చిరు గురించి వెంకీ.. వెంకీ గురించి చిరు పాడడం. బాగుంది.
ఈ సాంగ్ విన్న వెంటనే నచ్చేలా ఉంది. ఈ సాంగ్ మూవీకే హైలెట్ గా నిలవడం ఖాయం. సాహో గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సంక్రాంతికి భారీ అంచనాలతో.. భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా సక్సెస్ పై మేకర్స్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి.. మన శంకర్ వరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu) సరికొత్త రికార్డ్ సెట్ చేస్తారేమో చూడాలి.
Read Also: ఆ హీరో నా కెరీర్ ను మలుపుతిప్పాడు.. అనిల్ రావిపూడి కామెంట్స్
Follow Us On: Instagram


