ఏఐఎంఐఎం నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీన్ కుమార్(RS Praveen Kumar) ఘాటు విమర్శలు చేశారు. వాళ్లు దొంగ మైనారిటీలని చురకలంటించారు. తాము మైనారిటీ వాయిస్ అని చెప్పుకునే ఒవైసీ బ్రదర్స్.. ముస్లిం ఐఏఎస్ రిజ్వీ మీద సీఎం రేవంత్, మంత్రి జూపల్లి నిందలు మోపుతుంటే ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ఎందుకు వాళ్లు నోరు మెదపడం లేదని నిలదీశారు. ‘‘జూపల్లి కృష్ణారావు, రిజ్వీ మీద యాక్షన్ తీసుకోవాలని చీఫ్ సెక్రటరీకి లేఖ రాశాడు. ఈ ఓవైసీ బ్రదర్స్ ఏమో దీని మీద నోరు మెదపకుండా పోయి రేవంత్ రెడ్డితో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు’’ అని విమర్శించారు. అనంతరం నవీన్ యాదవ్ ప్రచారంపై కూడా ప్రవీణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘‘నవీన్ యాదవ్ ర్యాలీలో వ్యభిచార గృహం నడిపించి అరెస్టైన అఖిల్ యాదవ్ అనే వ్యక్తి పాల్గొన్నాడు. కత్తులు, కటారులు పట్టుకొని డ్యాన్సులు చేస్తూ పోతున్నారు. వీళ్ళక మీరు ఇవాళ ఓట్లు వేయాల్సింది’’ అని RS Praveen Kumar అన్నారు.
Read Also: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పొడిగింపుపై తీర్పు రిజర్వ్..

