Mobile Popup Ad
Mobile Popup Ad

ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే: కవిత కొత్త పార్టీపై BRS​ రియాక్షన్​!

కలం, వెబ్​ డెస్క్​ : రాజకీయాల్లో వారసత్వ పోరు, కొత్త సమీకరణాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత (Kavitha) ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) పేరుతో కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రకటించిన నేపథ్యంలో, బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించింది.

ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ బీఆర్ఎస్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేసింది. ఇందులో ప్రముఖ బ్రాండ్లు అయిన కోల్​గేట్, బిస్లరీ వంటి వస్తువుల అసలు ఉత్పత్తులకు, వాటిని పోలి ఉండే నకిలీ ఉత్పత్తులకు మధ్య ఉన్న తేడాలను చూపే ఫొటోలను ప్రదర్శించింది. దీని ద్వారా కవిత స్థాపించిన కొత్త పార్టీ అసలైన టీఆర్ఎస్ కాదని, అది కేవలం నకిలీ అనుకరణ మాత్రమేనని బీఆర్ఎస్ పరోక్షంగా ఎద్దేవా చేసింది.

గతంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పేరుతో ఉద్యమ ప్రస్థానం మొదలై, ఆ తర్వాత అది జాతీయ రాజకీయాల కోసం భారత్ రాష్ట్ర సమితి (BRS)గా రూపాంతరం చెందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే టీఆర్ఎస్ అక్షరాలు వచ్చేలా తెలంగాణ రాష్ట్ర సేన అని పేరు పెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారగా, నెటిజన్లు దీనిపై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

Read Also: అజారుద్దీన్​, కోదండరాంలకు లైన్​ క్లియర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>