అజారుద్దీన్​, కోదండరాంలకు లైన్​ క్లియర్

కలం, వెబ్​ డెస్క్ : అజారుద్దీన్ (Azharuddin), కోదండరాంకు (Kodandaram) లైన్ క్లియర్ అయ్యింది. గత ఏడాది 30న వీరి అభ్యర్థిత్వాల కోసం ప్రభుత్వం తెలంగాణ గవర్నర్ కు ప్రతిపాదనలు పంపించింది.. ఈ ప్రతిపాదనలను తాజాగా గవర్నర్ ఆమోదించారు. అజారుద్దీన్ మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల లోపు ఎమ్మెల్సీగా నియామకం కావాల్సి ఉంది. దీంతో ఆయనకు చిక్కులు తొలగిపోయాయి

వీడిన ఉత్కంఠ

అజారుద్దీన్ (Azharuddin) మంత్రి పదవి విషయంలో నేటి వరకు తీవ్రమైన ఉత్కంఠ నెలకొన్నది. ఆయన మంత్రిగా కొనసాగుతారా? లేక రాజీనామా చేయాల్సి ఉంటుందా? అనే టెన్షన్ ఉండేది. ఈ నెల 30 లోగా ఆయన ఎమ్మెల్సీ అయితేనే మంత్రిగా కొనసాగే అవకాశం ఉంది. అయితే తాజాగా గవర్నర్ ఎమ్మెల్సీగా ఆమోదం తెలపడంతో అజహారుద్దీన్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఇటీవల రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్‌లను నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా మంత్రివర్గం ఆమోదం తెలిపి గవర్నర్‌కు గతంలో సిఫారసు చేసింది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గవర్నర్ వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. మొత్తానికి అజారుద్దీన్ మంత్రి పదవిలో కొనసాగనున్నారు.

Read Also: సాయుధ పోరాటాన్ని వదలం.. మావోయిస్టు పార్టీ ప్రకటన!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>