కలం, వెబ్ డెస్క్: కవిత (Kavitha) తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ప్రారంభ ఉపన్యాసంలో కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద విమర్శలు గుప్పించారు. కాగా కవిత పార్టీపై బీఆర్ఎస్ సోషల్ మీడియా సెటైర్లు మొదలుపెట్టింది. కవిత పార్టీని షర్మిల పార్టీతో పోలుస్తూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వైఎస్సార్‌టీపీ ఆవిర్భావ దినోత్సవం నాడు షర్మిల కట్టుకున్న చీర.. కవిత చీర ఒకేలా ఉండటంతో ఆ రెండు ఫొటోలను పోస్ట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. షర్మిల లాగానే కవిత కూడా రాజకీయాల్లో సక్సెస్ కాలేరు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా షేర్ చేస్తుండటం గమనార్హం. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీ సోషల్ మీడియా విరుచుకుపడుతోంది. కవితది రీల్స్ పార్టీ అంటూ విమర్శిస్తోంది. కవిత, షర్మిలది న్యాప్టాల్ ప్రొడక్ట్ అంటూ వాళ్లు విమర్శిస్తున్నారు.
తమ పార్టీ ఒరిజినల్ అని కవిత (Kavitha) పార్టీ నకిలీ అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండటం గమనార్హం. ప్రముఖ కంపెనీలను పోలిన నకిలీ కంపెనీల ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయో.. కవిత పెట్టిన పార్టీ కూడా నకిలీదేనని వారు విమర్శిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఉదాహరణలతో సహా పోస్టులు పెడుతున్నారు. కోల్గెట్, బిస్లరీ లాంటి కంపెనీలను పోలిన నకిలీ కంపెనీలను వారు పోస్టుల్లో పెడుతున్నారు.
Read Also: పార్ట్‌నర్ నచ్చకపోతే శరీరం తిరుగుబాటు చేస్తుందా..? కొందరు మహిళల అనుభవాలు ఏం చెప్తున్నాయంటే..
Follow Us On: Instagram

