కలం, వెబ్ డెస్క్ : బియ్యం ఎగుమతుల్లో స్కామ్ (Rice Export Scam) జరుగుతోందంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అసెంబ్లీ వేదికగా స్పందించారు. బియ్యం ఎగుమతుల్లో ఎలాంటి స్కామ్ జరగట్లేదని స్పష్టం చేశారు. బీఆర్ ఎస్ నేతలు సిఫార్సు చేసిన వారికి కాంట్రాక్టులు ఇవ్వకపోతే స్కాములు జరుగుతున్నాయని ఆరోపణలు చేయడం సరికాదన్నారు మంత్రి. ప్రేమ్ చందర్ గార్గ్ కు బియ్యం ఎగుమతులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మధ్యవ్యక్తులు లేకుండా పిలిప్పీన్స్ తో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. రెండు ప్రభుత్వాల మధ్యనే ఈ ఒప్పందం జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్.
ఆదిత్య బిర్లా ట్రేడర్ (Aditya Birla Trade) ఎగుమతులను చూస్తోందని.. షిప్పింగ్, ప్యాకేజీ ఖర్చలు మొత్తం పిలిప్పీన్స్ భరిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. లక్ష మెట్రిక్ టన్నులకు పిలిప్పీన్స్ దేశంతో ఒప్పందం చేసుకున్నామని చెప్పుకొచ్చారు. పిలిప్పీన్స్ దేశంలో కొన్ని అంతర్గత అల్లర్లు జరగడంతో ఇతర దిగుమతులను ఆ దేశంలో బ్యాన్ చేశారని.. కానీ తెలంగాణ రైస్ కు మాత్రం స్పెషల్ పర్మిషన్ ఇచ్చి దిగుమతులు చేసుకుంటున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అలాగే తనకు హెలికాప్టర్ లో తిరగాలనే సరదా లేదన్నారు. తాను యుద్ధ విమనాల్లో తిరగానని.. అలాంటి తనకు హెలికాప్టర్ లో తిరిగే మోజు ఎందుకు ఉంటుందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.
Read Also: కాలుష్యాన్ని పెంచుతున్న కంపెనీలను ORR బయటకు పంపిస్తాం : సీఎం రేవంత్
Follow Us On: Facebook

