నాణ్యమైన మెటీరియల్‌ అందించడం అభినందనీయం: ఎమ్మెల్యే

కలం, నిర్మల్: స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌ తెలంగాణ (ఎస్‌టీయూటీఎస్‌) ఆధ్వర్యంలో రూపొందించిన టెట్‌ అధ్యయన సామగ్రిని ముధోల్‌ ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌ (MLA Ramarao Patel) ఆదివారం బైంసా పట్టణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టెట్‌ పరీక్ష రాసే అభ్యర్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిపుణులతో అధ్యయన సామగ్రిని రూపొందించి, అత్యంత తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. టెట్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయ అభ్యర్థులకు సమగ్ర మార్గదర్శకంగా నిలిచేలా మెటీరియల్ రూపొందించారని అన్నారు.

ఉపాధ్యాయ సంఘాలు కేవలం తమ హక్కుల సాధనకే పరిమితం కాకుండా విద్యార్థులు, ఉపాధ్యాయుల అభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం సమాజానికి ఎంతో ప్రయోజనకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భూమన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌, ఆర్థిక కార్యదర్శి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగభూషన్‌, బాజారెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>