పొంగులేటిపై గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేయ‌నున్న బీఆర్ఎస్!

క‌లం, వెబ్ డెస్క్‌: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నారంటూ బీఆర్ఎస్ (BRS) నేత‌లు తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. రాఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ అక్ర‌మాలు బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే దీనిపై హౌస్ క‌మిటీకి డిమాండ్ చేస్తూ అసెంబ్లీ, శాస‌న మండ‌లిలో నిర‌స‌న‌లు తెల‌ప‌గా బీఆర్ఎస్ స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేశారు. దీంతో నేడు పొంగులేటిపై తెలంగాణ గవర్నర్‌కు ఫిర్యాదు చేయాల‌ని బీఆర్ఎస్ నిర్ణ‌యించింది. కేటీఆర్ (KTR) నేతృత్వంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం గ‌వ‌ర్న‌ శివ్ ప్రతాప్ శుక్లాను కలిసి నివేదిక ఇవ్వనున్నది .

మ‌రోవైపు వట్టినాగులపల్లి మంత్రి పొంగులేటి కుమారుడి భూ కబ్జాల‌ భాగోతం బయటపెడ‌తామ‌ని కేటీఆర్ చెప్తున్నారు. నిన్న అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ స‌భ్యుల‌ను సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో కేటీఆర్ నివాసంలో ఎమ్మెల్యేలంతా భేటీ అయ్యారు. కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా వట్టినాగులపల్లికి వెళ్లేందుకు నిర్ణ‌యించుకున్నారు. వ‌ట్టినాగుల‌ప‌ల్లిలో (Vattinagulapally) పొంగులేటి కుమారుడు హ‌ర్ష‌ భూకబ్జాల‌కు పాల్ప‌డుతున్నార‌ని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. హ‌ర్ష‌ బాధితులను కలుస్తామ‌ని, కబ్జాకు గురైన భూములను పరిశీలించి, బాధితులకు అండగా ఉంటామ‌ని చెప్తున్నారు. కేటీఆర్ (KTR) నివాసం నుండి బీఆర్ఎస్ నేత‌లంతా వట్టినాగులపల్లికి బయలుదేరారు. కేటీఆర్ నివాసం వద్ద భారీగా పోలీసుల మోహరించారు.

Read Also: ఢిల్లీలో ఉగ్రకుట్ర భగ్నం: కీలక ఉగ్రవాది అరెస్ట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>