కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఆగస్టు 17వ తేదీ నుంచి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయిలో కూడా నిర్వహించనున్నట్లు మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. ప్రజలు తమ సమస్యలు, వినతులు, ఇతర దరఖాస్తులను ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో అందజేయాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయిలో నిర్వహిస్తున్నందున, మళ్లీ కలెక్టర్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి, నిబంధనల మేరకు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

