ఏపీకి నితిన్ న‌బీన్ రాక‌.. ఎప్పుడంటే?

క‌లం, వెబ్‌డెస్క్‌: బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్ (Nitin Nabin) ఏపీ ప‌ర్య‌ట‌న ఖ‌రారైంది. ఈ నెల 17న సోమ‌వారం రోజు ఆయ‌న ఏపీకి రానున్నారు. ఆగ‌స్ట్ 21 వ‌ర‌కు అంటే ఐదు రోజులు ఆయ‌న ఏపీలో ఉండ‌నున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర బీజేపీ ఆధ్వ‌ర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగ‌స్ట్ 17న సాయంత్రం భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి చేరుకోనున్న నితిన్ న‌బీన్‌కు పార్టీ నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లుక‌నున్నారు.

ఆగ‌స్ట్ 18న తెల్ల‌వారుజామున సింహాచ‌లం ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌నున్నారు. ఆ త‌ర్వాత విశాఖ‌లో జ‌రుగ‌నున్న జిల్లా అధ్య‌క్షులు, ఇన్‌చార్జీల సమావేశంలో పాల్గొంటారు. పార్టీ బ‌లోపేత‌మే ధ్యేయంగా ముఖ్య నాయ‌కుల‌తో కీల‌క చ‌ర్చ‌లు జ‌రిపే అవ‌కాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>