Mobile Popup Ad
Mobile Popup Ad

సిల్వర్ జూబ్లీ @ తెలంగాణ భవన్

కలం, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అధ్యక్షతన ఈ నెల 27న పార్టీ ప్లీనరీ (BRS Plenary) సమావేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనున్నది. మధ్యాహ్నం రెండు గంటలకు కేసీఆర్ హాజరవుతారని, ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ వేడుకలు జరగనున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ ఆవిర్భవించి పాతికేళ్లు పూర్తయిందని గుర్తుచేశారు. పార్టీ రజతోత్సవాల ముగింపు సంబురాల్లో కేసీఆర్ యావత్తు పార్టీ శ్రేణులకు మెసేజ్ ఇస్తారని, ఇందుకోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటైందని ఆ ప్రకటనలో కేటీఆర్ తెలిపారు.

సిల్వర్ జూబ్లీ (Silver Jubilee) సందర్భంగా పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, కొత్త సభ్యులను మెంబర్లుగా చేర్పించడం, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం, తాజా రాజకీయ అంశాలపై చర్చ తదితరాలన్నీ ప్లీనరీ (BRS Plenary) సెషన్‌లో ఉంటాయని తెలిపారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు ఆహ్వానితులని వివరించారు.

Read Also: ఆర్టీసీ సమ్మె.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ప్రభుత్వం

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>