బీహార్(Bihar)లో అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. రెండు కూటముల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంటోంది. ఈ క్రమంలో బుధవారం.. ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్(Tejashwi Yadav) తన నామినేషన్‌ను దాఖలు చేశారు. రాఘోపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన తన నామినేషన్ వేశారు. తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, తల్లి రబ్రి దేవి వెంటరాగా.. తేజస్వీ తన నామినేషన్ పత్రాలను అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా రబ్రిదేవి మాట్లాడుతూ.. నామినేషన్ వేశామని, గెలిచేది తామేనని ధీమా వ్యక్తం చేశారు.
కూటమి పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని, వారు తమ పార్టీనే భారీ మెజార్టీతో గెలిపిస్తారని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. అయితే ఆర్‌జేడీ తరుపున తేజస్వీ యాదవ్(Tejashwi Yadav).. సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కానీ అందుకు ఇండి కూటమి అనుమతించడం లేదు, తేజస్వీ యాదవ్ ఆ పార్టీకి సీఎం అభ్యర్థేమో కానీ కూటమికి కాదని కాంగ్రెస్ నేతలు పలువురు వ్యాఖ్యానించారు. దాంతో బీహార్‌లో ఇండి కూటమిలో ఎన్నికలకు ముందే చీలకలు వచ్చాయన్న ప్రచారం జరుగుతోందని, కానీ మరో పక్కా ఇండి కూటమి కలిసికట్టుగానే ముందుకు వెళ్తోంది. దీంతో బీహార్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
Read Also: Read Also: బీసీలకు న్యాయం జరగదు.. రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

