‘పెళ్ళి అనేది ఒక అనవసర రిలేషన్, చేసుకోవడం ఎందుకు ఆ తర్వాత విడిపోవడం ఎందుకు. అందుకే జీవితంలో పెళ్ళి చేసుకోకూడదని ఫిక్స్ అయ్యా’ తాజాగా బిగ్‌బాస్ ఫేమ్ ఫ్లోరా సైని(Flora Saini) చేసిన కామెంట్స్. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న ఫ్లోరా, ఈ ఫ్లోరా ఒకరేనా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో చాలా డీసెంట్‌గా ఉన్న ఫ్లోరా.. బయటకొచ్చాక ఇలా మాట్లాడుతుందేంటని అవాక్కవుతున్నారు. అయితే బిగ్ బాస్ నుంచి ఐదో వారం ఫ్లోరా ఎలిమినేట్ అయింది. ఎనిమినేషన్ తర్వాత ఫ్లోరా అందరిలా కాకుండా చాలా సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగానే ఎలిమినేషన్ ఇంటర్వ్యూలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్ళిపై కూడా దిమ్మతిరిగే సమాధానాలు ఇచ్చింది. తాను ఎవరితోనూ పెద్దగా కలవనని చెప్పింది. కలవడం, ఆ తర్వాత విడిపోవడం అనే కాన్సెప్టే తనకు నచ్చదని వివరించింది.
‘‘నేను పెళ్ళి చేసుకోకూడదని డిసైడ్ అయ్యా. నేను నా ఫ్రెండ్స్‌లో చాలా మందిని చూశా. పెళ్ళి అయిన రెండు మూడు సంవత్సరాలకే విడాకులని విడిపోతున్నారు. ఆ తలనొప్పి నాకెందుకు. అందుకే పెళ్ళిపై ఇంట్రస్ట్ చూపించడం లేదు. పెళ్ళికి ముందే డేటింగ్‌లో అన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు పెళ్ళి చేసుకుని విడిపోవడం లాంటి కష్టాలు ఎందుకు. డేటింగ్ చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేయడం బెటర్ కదా. అందుకే నేను అలా డిసైడ్ అయ్యా. నాకు ప్రస్తుతం ఒక బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. తను, నేను డేటింగ్ చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాం’’ Flora Saini అని చెప్పింది.
Read Also: నోటికొచ్చినట్లు మాట్లాడకూడదు: సిద్ధూ

