కలం, వెబ్ డెస్క్: ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో నారా లోకేశ్ (Nara Lokesh) ఒక సంచలనం. టీడీపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో శ్రమించాడు. “యువ గళం పాదయాత్ర” పేరుతో అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకున్నారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టారు. ఫలితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు ముఖ్యపాత్ర వహించాడు. 2019లో మంగళగిరిలో ఓడిపోయిన ఆయన 2024లో అదే స్థానం నుంచి గెలిచి తానేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీ నిర్మాణంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
శుక్రవారం నారా లోకేశ్ పుట్టినరోజు (Birthday) సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు చెప్తున్నారు. తన భర్త లోకేశ్‌కు నారా బ్రహ్మణి టిట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నీవు నిశ్శబ్దంగా మోస్తున్న బాధ్యతలు, చేసిన త్యాగాలు అన్నీ నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి’’ అంటూ ట్వీట్ చేశారామె. అలాగే టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు లోకేశ్‌కు విషెస్ చెప్పారు.


