ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బొత్ససత్యనారాయణ(Botsa Satyanarayana) కుటుంబానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. వారు కూర్చుని ఉన్న వేదికగా ఒక్కసారిగా కుప్పకూలింది. కాగా, ఈ ప్రమాదం నుంచి బొత్స, ఆయన కుటుంబీకులు సురక్షితంగా బయటపడ్డారు. మంగళవారం ఆయన తన కుటుంబ సమేతంగా విజయనగరంలోని శ్రీపైడితల్లి సిరిమానోత్సవం(Paiditalli Sirimanotsavam) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో బొత్స కుటుంబం కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. కాగా కార్యక్రమం మొదలైన కొద్దిసేపటికే వేదిక కుప్పకూలింది. ఈ ఘటనలో మాజీ మంత్రి ఫ్యామిలీకి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
అయితే ఈ ప్రమాదంలో ఎస్సై అశోక్, మరో చిన్నారికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో బొత్స(Botsa Satyanarayana), ఆయన సతీమణి ఝాన్సీ లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అక్కడికి సెక్యూరిటీ రాగా.. తనకు ఏమీ కాలేదని చెప్పారు. అంతేకాకుండా తమతో పాటు పడిపోయిన వారికి సహాయం చేయాలని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

