కలం, వెబ్ డెస్క్ : బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి (Nora Fatehi) కారుకు యాక్సిడెంట్ అయింది. ముంబైలో జరుగుతున్న సన్ బర్న్ ఫెస్టివల్ కు వెళ్తున్న నోరా కారును మరో కారు ఢీ కొట్టింది. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో నోరా ఫతేహికి స్వల్ప గాయాలు అయ్యాయి. కారు ప్రమాదానికి కారణమైన వినయ్ సక్పాల్ (27)మద్యం సేవించి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. స్వల్పగాయాలు కావడంతో హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తర్వాత నోరా ఫతేహి ఫెస్టివల్ కు వెళ్లింది. ఆమె సేఫ్ గానే ఉన్నారని నోరా టీమ్ తెలిపింది. వినయ్ సక్పాల్ ను పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: ధర్మరాజునే మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు
Follow Us On: X(Twitter)


