కలం, వెబ్ డెస్క్ : సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. కంగ్టి మండలం తుర్కా వడగామలోని శ్రీ సమర్థ్ ప్రొటెక్ట్ పత్తి మిల్లులో ఆదివారం తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే వెళ్లి మంటలను ఆర్పారు. కానీ అంతలోపే మిల్లులోని సామాగ్రి మొత్తం కాలి బూడిద అయిందని మిల్లు నిర్వాహకులు చెబుతున్నారు. భారీగా ఆస్తినష్టం వాటిల్లిందని అంటున్నారు. మంటలను అదుపులోకి తేవడానికే నాలుగు గంటలు పట్టింది. షార్ట్ సర్క్యూట్ ద్వారా అగ్ని ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: చంద్రుడిపై నాసా పర్మినెంట్ బేస్.. అప్పటిలోపే..!
Follow Us On: Youtube


