కలం, వెబ్ డెస్క్: ప్రతిరోజు గుడ్డు తినడం వల్ల శరీరానికి తగినంత ప్రోటీన్ (Protein) అందుతుంది. గుడ్డు తినేవారికి ఉడికించినవి (Eggs) తినాలా లేక ఆమ్లెట్ తినాలా అనే సందేహం ఉంటుంది. సాధారణంగా గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్, 70 కేలరీలుంటాయి. ఇవి కండరాల బలం, మెరుగైన మెదడు పనితీరు, రోగనిరోధక శక్తిపెంచుతాయి. గుడ్లలో 9 అమైనో ఆమ్లాలు ఉండటంతో ‘శరీరానికి బిల్డింగ్ బ్లాక్స్’ అని పిలుస్తారు. ఉడికించిన గుడ్డు, ఆమ్లెట్.. రెండు హెల్త్ ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, పోషకాలు అందించడంలో తేడాలున్నాయి.
వేటిలో ప్రోటీన్ ఎక్కువంటే
ఉడికించిన గుడ్లు మందంటున్నారు నిపుణలు. ఉడికించిన గుడ్లను ఇతర వంటకాలతో కలిపి తినొచ్చు. ఉడికించిన గుడ్లలో పోషకాలు, ప్రోటీన్ (Protein), ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అయితే చాలామంది ఆమ్లెట్ (Omelette) తినడానికి ఇష్టం చూపుతారు. బ్రెడ్ ఆమ్లేట్, చీజ్ ఆమ్లేట్.. ఇలా రకరకాలుగా తినడానికి ఇష్టం చూపుతున్నారు. వీటి వల్ల కూడా పోషకాలు అందుతాయి. అయితే ఉడికించిన గుడ్లు సరైన పోషకాలు అందిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఆమ్లెట్ మంచి రుచిని అందించనప్పటికీ ఇతర ఫుడ్ ఐటమ్స్‌తో కలిపి తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.
గుడ్లతో ఆరోగ్య ప్రయోజనాలివే..
- కండరాలు బలంగా ఉండటం
- మెదడు ఆరోగ్యం మెరుగుపర్చడం
- తక్షణ శక్తి అందించడం
- కంటి ఆరోగ్యాన్ని కాపాడటం
- రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడం
- బరువు తగ్గించడం
- చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం
Read Also: జామపండును ఇలా తింటేనే అధిక లాభాలు..!
Follow Us On : WhatsApp


