కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది (2025)లో మహిళలు, పిల్లలపై నేరాలు (Hyderabad Crime) పెరిగాయి. అయితే మొత్తంగా నేరాల శాతం మాత్రం తగ్గింది. మొత్తం నేరాలు 15 శాతం నేరాలు తగ్గాయని సీపీ సజ్జనార్ (CP Sajjanar) వెల్లడించారు. ఈ మేరకు ఆయన శనివారం 2025 వార్షిక నివేదికను విడుదల చేశారు. మహిళలపై ఆరు శాతం నేరాలు తగ్గాయని చెప్పారు.
తెలంగాణ పోలీసులు అలర్ట్‌గా సమర్థవంతంగా పనిచేస్తున్నారని ఇతర రాష్ట్రాల గ్యాంగ్‌లు ఇక్కడికి రావాలంటే భయపడుతున్నాయని సజ్జనార్ చెప్పారు. సోషల్ మీడియాలో నేరగాళ్ల బారిన పడొద్దని సూచించారు. ఆరున్నర కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుకున్నామని వెల్లడించారు. బీఎన్ఎస్ (భారతీయ న్యాయసంహిత) కేసులు 15 శాతం తగ్గాయి. ఎస్ఎల్ఎస్ ప్రత్యేక, స్థానిక చట్టాల కింద నమోదైన కేసుల్లోనూ 14 శాతం తగ్గుదల నమోదైందని పేర్కొన్నారు.
శారీరక నేరాలు 16% తగ్గాయని, తీవ్ర శారీరక నేరాలు 4% తగ్గాయని తెలిపారు. సాధారణ శారీరక నేరాలు 17% తగ్గాయని వివరించారు. ఆస్తి సంబంధిత నేరాలు 28 శాతం తగ్గాయని, మహిళలపై నేరాలు 6% పెరిగాయని వివరించారు.
పిల్లలపై నేరాలు (పోక్సో కేసులు) 27 పెరిగాయని, సైబర్ నేరాలు 8% తగ్గాయని చెప్పారు. 2025లో మొత్తం నేరాలపై నియంత్రణ సాధించడంలో హైదరాబాద్ సిటీ పోలీస్ గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, మహిళలు, పిల్లలపై నేరాల పెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నివేదికలో(Hyderabad Crime) పేర్కొన్నారు.
Read Also: స్టీల్ ప్లాంట్‌పై మోడీ, బాబు పవన్‌లది యాక్టింగ్ – జగ్గారెడ్డి
Follow Us On: X(Twitter)


