epaper
Sunday, March 1, 2026
epaper

జామపండును ఇలా తింటేనే అధిక లాభాలు..!

Guava Benefits | జామకాయను ఎలా తిన్నా అనేక ఆరోగ్య లాభాలు ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరికీ తెలుసు. ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్కటీ మానవుడికి మేలు చేసేదే. కానీ కొన్ని తీసుకోవాల్సిన పద్దతిని పాటించాల్సి ఉంటుంది. మరికొన్ని సమయం పాటించాల్సి ఉంటుంది. కానీ జామ పండును ఎప్పుడూ తిన్నా లాభాలు బాగానే ఉంటాయి. అయితే జామ పండుతో అధికలాభాలు పొందాలంటే మాత్రం.. దానికి ఉదయం ఖాళీ కడుపుతో తినాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. జామపండు సహజసిద్ధమైన పోషకాలతో నిండిన పండు. ఇందులో ఉన్న ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, బరువు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇలా మరెన్నో లాభాలు కూడా ఉన్నాయి.

Guava Benefits : 

బలమైన జీర్ణవ్యవస్థ..

జామపండు అత్యధిక ఫైబర్‌ను కలిగి ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తినడం వల్ల పేగుల కదలిక సహజంగా మెరుగవుతుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. గ్యాస్, బ్లోటింగ్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గిపోతాయి. పేగుల్లో సహజ డిటాక్స్ ప్రభావం కలుగుతుంది. జామపండులో ఉండే సహజ ఎంజైములు ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియను వేగవంతం చేస్తాయి, దీని వల్ల రోజంతా లైట్‌గా, ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది.

రోగనిరోధక పెరుగుతుంది

జామపండు విటమిన్ Cకి అత్యుత్తమ మూలాల్లో ఒకటి. ఒక జామపండులో రోజువారీ అవసరానికి రెండింతల వరకూ విటమిన్ C లభిస్తుంది. విటమిన్ C వల్ల శరీరం యాంటీఆక్సిడెంట్లను వేగంగా గ్రహిస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ బలపడుతుంది. జలుబు, ఫ్లూ, అలసట వంటి సీజనల్ ఇన్ఫెక్షన్లకు నిరోధకత పెరుగుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగై, గ్లో ఇస్తుంది. ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు శరీరం పోషకాలను అధికంగా శోషించగలదు, అందుకే ఇమ్యూనిటీపై మంచి ప్రభావం ఉంటుంది.

బరువు నియంత్రణ

జామపండులో కేలరీలు తక్కువగా ఉండటం, ఫైబర్ ఎక్కువగా ఉండటం బరువు తగ్గాలనుకునే వారికి మంచి ప్లస్ పాయింట్. ఎక్కువ సేపు ఆకలి రాకుండా చేస్తుంది. అనారోగ్యకరమైన స్నాక్స్‌ తీసుకోవాలనిపించకుండా అడ్డుకుంటుంది. మెటబాలిజం రేటును పెంచుతుంది. కేలరీ బర్నింగ్ వేగాన్ని మెరుగుపరుస్తుంది. ఖాళీ కడుపుతో తింటే శరీరంలో కొవ్వు కరిగే ప్రాసెస్ వేగవంతమవుతుంది, తద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

Read Also: వీటిని తరచూ తింటే ఆరోగ్యంగా ఉంటారు

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!