Mobile Popup Ad
Mobile Popup Ad

ఉప్పల్ స్టేడియంలో బ్లాక్ టికెట్ మాఫియా జోరు

కలం, వెబ్ డెస్క్: ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు జరగబోతున్న హై ఓల్టేజీ మ్యాచ్‌ను క్యాష్ చేసేందుకు బ్లాక్ టికెట్ మాఫియాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను డిస్ట్రిక్‌ యాప్‌లో విక్రయించగా.. 39 వేల టికెట్లు కేవలం 3 నిమిషాల్లో అయిపోయాయి. ఆ తరువాత టికెట్స్ కోసం ప్రయత్నించినవారికి సోల్డ్‌ఔట్‌ అంటూ బోర్డ్‌ కనిపించడంతో క్రికెట్ లవర్స్ షాకవుతున్నారు. అయితే, దీని వెనుక బ్లాక్ టికెట్ మాఫియా హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. డిస్ట్రిక్ యాప్‌లో ముందే మాఫియా పెద్ద సంఖ్యలో టికెట్లు కొని.. తరువాత స్టేడియం వద్ద బహిరంగంగానే కాంప్లిమెంటరీ ఇతర మార్గాల ద్వారా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

బ్లాక్ టికెట్స్ విక్రయిస్తే జైలుకే: సీపీ సుమతి

ఉప్పల్ స్టేడియంలో (Uppal Stadium) జరుగుతున్న బ్లాక్ టికెట్ల విక్రయాలపై మల్కాజ్ గిరి సీపీ సుమతి స్పందించారు. ఇప్పటికే, ఇలాంటి వారిపై పూర్తి స్థాయి నిఘా ఏర్పాటు చేసి పట్టుకున్నామని.. వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే, ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగి.. అచ్చం డిస్ట్రిక్ట్ యాప్ లాంటిదే క్రియేట్ చేసి ఫేక్ టికెట్లు అమ్ముతున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.

Read Also: ఎవరెస్ట్ పై వందేమాతరం.. చరిత్ర సృష్టించిన BSF మహిళా బృందం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>