కలం, వెబ్ డెస్క్ : భారత సరిహద్దు దళం (BSF ) చరిత్ర సృష్టించింది. మొత్తం మహిళలతో కూడిన బృందం ఎవరెస్ట్ శిఖరాన్ని (Mount Everest) విజయవంతంగా అధిరోహించింది. 14 మందితో కూడిన బృందం 19వ తేదీన ప్రారంభించిన యాత్ర నేడు (శుక్రవారం) పూర్తయింది. BSF డైమండ్ జూబ్లీ ఉత్సవాల సందర్బంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. 8,000 మీటర్ల ఎత్తులో ఉన్న ‘డెత్ జోన్’లో తీవ్రమైన వాతావరణం, తక్కువ ఆక్సిజన్ స్థాయి, కష్టతరమైన మంచు గోడలను అధిగమించి పర్వతారోహకులు అసాధారణ ధైర్యం, ఓర్పుతో పాటు జట్టు స్ఫూర్తిని ప్రదర్శించారు.
అంతేకాకుండా, ‘క్లీన్ హిమాలయ – సేవ్ గ్లేసియర్’ ప్రచారంలో భాగంగా ఎవరెస్ట్ ప్రాంతంలో పర్యావరణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, జీవవిచ్ఛిన్నం కాని వ్యర్థాలను బృందం సేకరించింది. ఈ విజయంతో ITBP ఇప్పటివరకు 232 పర్వతారోహణ యాత్రలను విజయవంతంగా పూర్తి చేయగా.. ఇందులో ఐదు ఎవరెస్ట్ శిఖరారోహణలు ఉన్నాయి. ఎవరెస్ట్ (Mount Everest), కాంచనజంగా, మకాలు, లోత్సే, ధౌలగిరి, మానస్లు అధిరోహించిన ఘనతను బీఎస్ మహిళా బృందానికి ఉంది. ఎవరెస్ట్ అధిరోహించిన అనంతరం బృందంలోని సభ్యులు వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ ఘటన భారత మహిళా సాహసం, ధైర్యం, సరిహద్దు దళాల సామర్థ్యానికి తార్కాణంగా నిలిచింది.

