కలం, వెబ్ డెస్క్ : షక్సాగామ్ వ్యాలీ (Shaksgam Valley) విషయంలో మరోసారి భారత్ ఘాటుగా స్పందించింది. షక్సాగామ్ ను చైనాకు పాకిస్థాన్ చట్టవిరుద్ధంగా అప్పగించిందన్నారు ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. షక్సాగామ్ వ్యాలీ తమదే అంటూ చైనా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది ఘాటుగా స్పందించారు. మంగళవారం ద్విదేది (Upendra Dwivedi) మీడియాతో మాట్లాడుతూ.. ‘1963లో షక్సాగామ్ వ్యాలీని పాకిస్థాన్ చైనాకు అప్పగిస్తూ చేసుకున్న ఒప్పందం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. ఆ ప్రాంతంలో భారత్ కు వ్యతిరేకంగా చైనా, పాకిస్థాన్ ఏం చేసినా చట్టవిరుద్ధంగానే భావిస్తాం‘ అంటూ చెప్పుకొచ్చారు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.
భారత్ సరిహద్దులో కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోందని.. ఉగ్రవాదులు దాడులు చేయాలని చూస్తే ధీటైన జవాబు ఇస్తామన్నారు ద్వివేది (Upendra Dwivedi). ఆపరేషన్ సిందూర్ లో ఉగ్రవాద మూలాలను దెబ్బతీశామన్నారు. పాకిస్థాన్ తో పాటు ఇతర దేశాలతో లింక్ ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టామని.. రాబోయే రోజుల్లో ఉగ్రవాదం కనుమరుగైపోవడం ఖాయం అంటూ చెప్పుకొచ్చారు ద్వివేది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ లో టెర్రరిస్టుల సంఖ్య 10లోపే ఉందన్నారు. వారిని కూడా త్వరలోనే మట్టుబెడుతామని చెప్పుకొచ్చారు ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది.
Read Also: జిల్లా, మండలాల మార్పుకు బ్రేక్ !
Follow Us On: Instagram


