కలం, వెబ్డెస్క్: కుక్క కాట్లకు, వాటి వల్ల సంభవించే మరణాలకు భారీ జరిమానా చెల్లించక తప్పదని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వీధి కుక్క (Stray Dogs) లపై ప్రేమ ఉన్నవాళ్లు వాటిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల విషయంపై దాఖలైన పిటిషన్లను కొన్ని రోజులుగా విచారిస్తున్న అత్యున్నత న్యాయస్థానం మంగళవారం మరో దఫా విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. వీధి కుక్కల బెడడ నివారించడానికి రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించింది. కుక్క కాట్లకు, మరణాలకు భారీ స్థాయిలో జరిమానా వేస్తామని పేర్కొంది.
కుక్క కాట్ల ప్రభావం మనిషిని దీర్ఘకాలం వేధిస్తుందన్న సుప్రీం.. వీధి కుక్కల (Stray Dogs) పై ప్రేమ చూపిస్తున్నవాళ్ల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. అంత ప్రేమ ఉంటే వాటిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాలంది. కుక్కలపై ప్రేమ చూపించే వ్యక్తులు, సంస్థలు మనిషి ప్రాణాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. ‘మీరు ప్రేమ చూపించే, ఆహారం పెట్టే కుక్కలు ఎవరినైనా కాటువేసి వారి మరణానికి కారణమైతే మీరు బాధ్యత వహిస్తారా?. మీ ఆందోళన కేవలం కుక్కల గురించేనా? మనుషుల సంగతి అవసరం లేదా?’అంటూ ప్రశ్నించింది. మీ బాధ కేవలం శునకాల గురించేనని, మేం మనుషుల గురించీ ఆందోళన చెందుతున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Read Also: ఖండాంతరాలు దాటిన ప్రేమ: ఫ్రాన్స్ యువకుడితో ఖమ్మం యువతి వివాహం
Follow Us On: X(Twitter)


