Mobile Popup Ad
Mobile Popup Ad

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్.. సర్‌ప్రైజ్ టూర్‌తో సస్పెన్స్?

కలం, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తున్నారు. ఒకవైపు రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా హఠాత్తుగా ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొన్నది. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లేలా షెడ్యూలు ఖరారైంది. కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ రచించిన ఒక పుస్తకాన్ని ఢిల్లీలో (Delhi) ఆవిష్కరించే ప్రోగ్రామ్ ఉండడంతో దాని కోసం వెళ్తున్నట్లు తెలిసింది. సాయంత్రం జవహర్ భవన్‌లో జరగనున్న ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అక్కడే ఉంటారా?.. రాత్రికి తిరిగి హైదరాబాద్ రిటన్ అవుతారా?.. ఈ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

అసెంబ్లీ సెషన్ జరుగుతున్నందున రాత్రికి తిరిగి వస్తారని, బుధవారం ఉదయం జరిగే సభా కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. రెండు వారాల క్రితం ఇదే తరహాలో సడెన్ విజిట్ చేయడంతో పలు రకాల ఊహాగానాలు వెలువడ్డాయి. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, అదనపు డీజీపీ.. తదితరులంతా వెళ్ళి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఇప్పుడు సీఎం ఒక్కరే వెళ్తున్నారు.

Read Also: ఎండాకాలం తప్పక తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే..!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>