ఏడాదికి 2 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. బీజేపీ హామీల వర్షం

కలం, వెబ్ డెస్క్ : కేరళ అసెంబ్లీ ఎన్నికల (Kerala Elections) వేళ గెలుపే లక్ష్యంగా పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి తరఫున బీజేపీ తమ మ్యానిఫెస్టో (BJP Manifesto)లో ఉచిత హామీలు ప్రకటించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కేరళ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేశారు. ఆహారం, ఆరోగ్యం, ఆర్థిక సాయం మొదలుకొని వివిధ హామీలు మ్యానిఫెస్టోలో ఉన్నాయి. ఎన్డీఏ అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. ఇందులో ఓనం పండుగ సమయంలో ఒకటి, క్రిస్మస్ పండుగ వేళ మరొకటి ఇస్తామని హామినిచ్చారు. ప్రతి ఇంటికి నెలకు 20వేల లీటర్ల ఉచిత నీరు అందిస్తామన్నారు. ఆర్థికంగా బలహీన వర్గాల ఆదాయ పరిమితిని రూ. 8 లక్షలకు పెంచుతామని హామీనిచ్చింది.

రూ.2,500 భక్ష్య ఆరోగ్య సురక్ష కార్డు..

మెడిసిన్, కిరాణం అవసరాల కోసం పేద మహిళలకు నెలకు రూ.2500 లతో భక్ష్య ఆరోగ్య సురక్ష కార్డు అందిస్తామని బీజేపీ హామీలో పేర్కొంది. పేద మహిళలు, వితంతువులు, 70 ఏళ్ల పైబడిన వృద్ధులకు నెలకు రూ.3 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించింది. అయితే, బీజేపీ ఉచిత హామీలు (BJP Manifesto) ఇవ్వడం రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

Read Also: జయలలిత ఇంటి సీజ్.. ఒక్కరోజులోనే వెనక్కి తగ్గిన జీహెచ్ఎంసీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>