Mobile Popup Ad
Mobile Popup Ad

జయలలిత ఇంటి సీజ్.. ఒక్కరోజులోనే వెనక్కి తగ్గిన జీహెచ్ఎంసీ

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత (Jayalalithaa)  పేరుతో హైదరాబాద్‌లో ఉన్న భవనాన్ని ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆస్తి పన్ను బకాయి పడటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా బంధువుల హామీతో జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ తొలగించారు.

యూసుఫ్‌గూడ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఓ భవనం జయలలిత (Jayalalithaa) పేరుతో రిజిస్టర్ అయ్యి ఉంది. ఈ భవనానికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు గణనీయంగా పేరుకుపోయాయి. మొత్తం రూ.1 కోటి 59 లక్షల మేర బకాయిలు ఉండగా, అందులో రూ.78 లక్షలు ప్రిన్సిపల్ అమౌంట్ కాగా, రూ.81 లక్షలు వడ్డీగా ఉన్నట్లు జీహెచ్ఎంసీ వర్గాలు తెలిపాయి.

బకాయిల చెల్లింపుపై పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన రాకపోవడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది ఆ భవనాన్ని సీజ్ చేశారు. తాజాగా జయలలిత బంధువులు జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించి, పెండింగ్‌లో ఉన్న మొత్తం ఆస్తి పన్నును మరో నెల రోజుల్లో పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ హామీని పరిగణనలోకి తీసుకున్న అధికారులు భవనంపై ఉన్న సీజ్‌ను ఎత్తివేశారు.

ఇక బకాయిలు పూర్తిగా చెల్లించకముందే సీజ్ ఎత్తివేయడం సరైన ప్రక్రియ కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సాధారణ ప్రజల విషయంలో కఠిన చర్యలు తీసుకునే జీహెచ్ఎంసీ, ప్రముఖుల ఆస్తుల విషయంలో మాత్రం సడలింపులు ఇస్తోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Read Also: శర్వానంద్ ‘బైకర్’కు ప్రభాస్ ప్రమోషన్.. వింటేజ్ లుక్ అదిరిందిగా

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>