కలం, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కి, యూవీ క్రియేషన్స్(UV Creations) బ్యానర్ కు మధ్య మంచి బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ బ్యానర్‌లో ప్రభాస్ నటించిన ‘మిర్చి’ (Mirchi) సినిమా 2013లో రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. మిర్చి సినిమాలో ప్రభాస్ స్టైలిష్ లుక్ ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. డ్యూడ్ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ అప్పట్లో తెగ పాపులర్ అయింది. చాన్నాళ్ళ తరువాత మళ్ళీ ప్రభాస్ మిర్చి లుక్‌లో కనిపించారు. యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand) నటించిన “బైకర్”(Biker) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్ ఈ లుక్ లో కనిపించారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అభిలాష్ రెడ్డి కంకర తెరకెక్కించిన “బైకర్” సినిమా ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ రాజశేఖర్ కీలక పాత్రలో నటించారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంది.. వైబ్ చాలా బాగుంది అంటూ ప్రభాస్ (Prabhas) ట్వీట్ చేశారు. ఈ సినిమాలో శర్వానంద్ డేరింగ్ బైక్ రేసర్‌గా కనిపించనున్నాడు. క్యూట్ బ్యూటీ మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించింది.
Read Also: పిల్లలు సంతోషాన్ని పెంచరు.. పరిశోధనలో విస్తుబోయే విషయాలు..!
Follow Us On: X(Twitter)

