కలం, వెబ్ డెస్క్ : అమెరికా (America ), ఇజ్రాయెల్ (Israel) – ఇరాన్ (Iran) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా దురాక్రమణకు దిగితే తీవ్ర పరిణామాలుంటాయని, ఆక్రమణకు పాల్పడే వారి కాళ్లను నరికేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు IRGC ప్రతినిధి ఇబ్రహీం జుల్ఫికారి ఓ ప్రకటనలో ఎలాంటి సైనిక చర్యనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. యూఎస్ గ్రౌండ్ ఆపరేషన్ ను ప్రారంభిస్తే ఇరాన్ కు రష్యా చెచెన్ యూనిట్లు వస్తాయని, హర్మూజ్ నుంచి ఒక్క నౌక కూడా వెళ్లదు అని హెచ్చరించారు.
అమెరికా (America), ఇజ్రాయెల్ పోరాటంలో తమదే అంతిమ విజయం అని ఇరాన్ (Iran) ధీమా వ్యక్తం చేసింది. ఇరాన్ ప్రజల మద్ధతు, జాతీయ ఐక్యతతో ముందుకు సాగుతున్నామన్నారు. హర్మూజ్ ను ఆక్రమించాలని చూస్తున్న అమెరికా కలలు నిజం కావని, యూఎస్ తనను తానే నాశనం చేసుకుంటుందన్నారు.
Read Also: ‘మీ చావు మీరు చావండి’.. ట్రంప్ సీరియస్ వార్నింగ్
Follow Us On : WhatsApp

