మా తుజే సలాం.. కొడుకు జ్ఞాపకార్థంగా సైనికుల కోసం షూ ప్యాడ్లు కుడుతున్న తల్లి

కలం, వెబ్ డెస్క్: సైనికుడైన కన్న కొడుకు మరణం ఆ తల్లిని కదిలించింది. తన లాంటి కొడుకుల కోసం ఏదైనా చేయాలని సంకల్పించింది. వీరమరణం పొందిన తన కుమారుడి గుర్తుగా సైనికుల కోసం షూ ప్యాడ్స్ కుడుతూ దేశభక్తిని చాటుకుంటోంది. చైనాలోని (China) చోంగ్‌కింగ్‌కు చెందిన జాంగ్ జింగ్‌హుయ్ అనే తల్లి సరిహద్దులో పనిచేసే సైనికులకు అండగా నిలుస్తున్నారు. 2005లో టిబెట్ పర్వత ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తూ తోటి సైనికుడిని కాపాడే ప్రయత్నంలో ఆమె కుమారుడు చనిపోయాడు. మరణ వార్త వినే సమయానికే ఆమె తన కుమారుడి కోసం 20 జతల షూ ప్యాడ్లు (Shoe Pads) సిద్ధం చేసింది. ఆ తర్వాత ఆమె సైనికులు పడే కష్టాలను చూసి చలించిపోయింది.

అప్పటి నుండి వారిని తన స్వంత బిడ్డలుగా భావిస్తూ షూ ప్యాడ్లను అందించాలని నిర్ణయించుకుంది. జాంగ్ జింగ్‌హుయ్ ఇప్పటివరకు 1,000 కంటే ఎక్కువ జతల షూ ప్యాడ్లను స్వయంగా తయారు చేసి సైనికులకు పంపిణీ చేశారు. ఆమె 20 ఏళ్లలో ఏడుసార్లు టిబెట్ సందర్శించి తన కుమారుడితో కలిసి పనిచేసిన సైనికులకు షూ ప్యాడ్స్ అందిస్తోంది. అంతేకాదు.. తన ఊరి ప్రత్యేక వస్తువులను కూడా తీసుకెళ్లుతున్నారు. షూ ప్యాడ్లు కుట్టేందుకు తాను వాడే పొడవైన దారం తన కుమారుడిపై ఉన్న ప్రేమకు చిహ్నమని ఆమె భావిస్తారు. ప్రస్తుతం 70 ఏళ్లు పైబడిన ఆమెకు చూపు తగ్గింది. అయినా సైనికుల కోసం కష్టపడుతూనే ఉంది.

కొడుకును కోల్పోయిన బాధలో ఉన్న ఆమెకు, ఇప్పుడు వందలాది మంది సైనికులు బిడ్డలుగా మారారు. కొడుకు స్నేహితులు రిటైర్ అయినప్పటికీ ఆమెను ప్రేమగా అమ్మ అని పిలుస్తూ యోగక్షేమాలు అడుగుతుంటారు. వారి ఇంట్లో జరిగే శుభకార్యాలకు హాజరవుతున్నారు. ‘నేను నా కొడుకును కోల్పోయాను, కానీ ప్రతిఫలంగా ఎంతోమంది సైనిక బిడ్డలను సంపాదించుకున్నా’ అని ఆమె గర్వంగా చెబుతున్నారు. ఈమె సేవా దృక్పథం ఇప్పుడు ఎంతోమందిని కదిలిస్తోంది.

Read Also: కాంట్రవర్సీ కౌశిక్​.. ఫ్యూచర్ ఏంటి?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>