కలం, వెబ్ డెస్క్: ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘ఫౌజీ'(Fauzi) మూవీ నుంచి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్త పోస్టర్ విడుదలైంది. చార్మినార్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండగా.. ప్రభాస్ ఫేస్ కనిపించకుండా, బాడీ మాత్రమే చూపిస్తూ.. రెండు చేతుల్లో గన్స్ పట్టుకుని నడుస్తూ కనిపిస్తున్నాడు. వెనుకాలే గాంధీ గెటప్‌లో మరో వ్యక్తిని చూపిస్తూ ట్విస్ట్ ఇచ్చాడు. A Battolion Who Fights Alone అంటూ పోస్టర్ మీద క్యాప్షన్ మరింత ఉత్కంఠ కలిగిస్తోంది.
ప్రభాస్ ఆర్మీ జవాన్ పాత్రలో నటిస్తుండగా.. యాక్షన్ సీక్వెన్స్ మాత్రం కళ్లు చెదిరేలా ఉండబోతున్నాయనేది తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ పోస్టర్ కథ ఎలా ఉండబోతుందో క్లారిటీగా చెబుతోంది. యాక్షన్‌తో పాటు హను మార్క్ అందమైన ప్రేమ కథ కూడా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. డిసెంబర్ మూడో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ప్రస్తుతం మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇమాన్వి హీరోయిన్ కాగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

