డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్‌కు ఎంపీ డీకే అరుణ కౌంటర్

కలం, వెబ్ డెస్క్ : నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ డీకే అరుణ (DK Aruna) కౌంటర్ ఇచ్చారు. డీలిమిటేషన్ పై కేసీఆర్ మాట్లాడినట్లుగానే రేవంత్ మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుపై క్రెడిట్ రావడం లేదని కాంగ్రెస్ బాధపడుతోందని ఆమె ఎద్దేవా చేశారు.

దీని కారణంగానే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారని ధ్వజమెత్తారు. అన్ని రాష్ట్రాల్లో జరిగినట్లే తెలంగాణలోనూ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. మహిళా బిల్లును అడ్డుకోవాలనే ఆలోచనను కాంగ్రెస్ మార్చుకుంటే బాగుంటుందని ఎంపీ డీకే అరుణ (DK Aruna) హితవు పలికారు.

కాగా, డీలిమిటేషన్ (Delimitation) అంశంలో కేంద్రం వైఖరిని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర స్థాయిలో ఎండగడుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపిస్తున్నారు. డీలిమిటేషన్ రాజకీయ పార్టీల సమస్య కాదని ప్రాంతీయ అస్థిత్వానికి ప్రధాన సమస్యగా మారుతుందని రేవంత్ స్పష్టం చేశారు. మహిళా బిల్లును.. డీలిమిటేషన్ తో ముడిపెట్టడం కరెక్ట్ కాదని కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ ధ్వజమెత్తారు.

Read Also: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రిజల్ట్స్‌పై కీలక అప్‌డేట్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>