మహారాష్ట్రలో భూకంపం.. రోడ్లపైకి పరుగులు తీసిన ప్రజలు!

కలం, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో (Maharashtra) శనివారం భారీ భూకంపం (Earthquake) సంభవించింది. హింగోలి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.7గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూమి ఒక్కసారిగా కంపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. కొద్ది సెకన్ల పాటు సాగిన ఈ ప్రకంపనల వల్ల ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు రోడ్లపైనే ఉండిపోయి ఆందోళన  చెందారు. అటు హింగోలి జిల్లా పొరుగు జిల్లాలైన నాందేడ్, పర్బని జిల్లాల్లోనూ భూకంప ప్రభావం కనిపించింది. ఆయా జిల్లాల్లోనూ స్వల్పంగా భూమి కంపించింది.

అయితే భూకంప (Earthquake) తీవ్రత 4.7గా నమోదైనప్పటికీ.. అదృష్టవశాత్తు ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. భూకంప పరిస్థితిని అధికారులు జిల్లాల వారీగా సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పాత భవనాల్లో నివసించే వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Read Also: ప్లస్సా.. మైనస్సా.. జీవన్‌రెడ్డి పార్టీ మార్పుపై కొత్త చర్చ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>