కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) లో బీఆర్ఎస్ బంద్ అట్టర్ ప్లాప్ అయిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి (Gangadi Krishna Reddy) విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద గొడవ జరిగిన విషయం తెలిసిందే. దీన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ కరీంనగర్ బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే కరీంనగర్ బంద్‌కు ఆదరణ కరువైందని, బీఆర్‌ఎస్ పిలుపును, విజ్ఞప్తిని ప్రజలు, వ్యాపారస్తులు కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకపోవడంతో బంద్ అట్టర్ ప్లాప్ అయిందని గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, కార్పొరేటర్లు, బీజేపీ శ్రేణులతో కలిసి కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేయడం బీజేపీ కార్యకర్తల ఉద్దేశం కానేకాదనీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశారని తెలిపారు.
ప్రభుత్వ నిధులతో కట్టిన క్యాంప్ ఆఫీసులో అభివృద్ధి గురించి మాట్లాడాలనీ, అందుకు భిన్నంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బండి సంజయ్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును రాజకీయ వేదికగా మార్చుకుని కౌశిక్ రెడ్డి కేంద్ర మంత్రి అనే గౌరవం లేకుండా అసభ్యకరంగా మాట్లాడడంతోనే గొడవ జరిగిందని వివరించారు. అసలు ఈ వివాదానికి మూల కారకుడు కేటీఆర్ అని, ఇటీవల కేటీఆర్ కరీంనగర్ పర్యటనకు వచ్చినప్పుడు బండి సంజయ్‌పై అనవసర వ్యాఖ్యలు, ఆరోపణలు చేసి వివాదాన్ని సృష్టించారని తెలిపారు. బండి సంజయ్ 48 గంటల్లో కేటీఆర్ చేసిన ఆరోపణలు నిరూపించాలని, ఆ ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేయడంతో ఇష్యును డైవర్ట్ చేసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో బీఆర్ఎస్ పార్టీ రాజకీయ డ్రామా మొదలుపెట్టిందని ఆయన ఘాటుగా విమర్శించారు.
కరీంనగర్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఓ అవుటేటెడ్ పార్టీగానే భావిస్తున్నారని, ఆ పార్టీ మాటను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదనే భావన ప్రజల్లో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కోలగాని శ్రీనివాస్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిళ్ళ రమేష్, ఇనుగొండ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడవెంకటరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాస్, కార్పొరేటర్లు వంగల పవన్ కుమార్, ఏపీపీ చంద్ర తోట అనిల్, కన్న కృష్ణ, సర్దార్ బల్బీర్ సింగ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పుప్పాల రఘు, దండు కొమురయ్య, మండల/జోన్ అధ్యక్షులు తణుకు సాయి కృష్ణ, భూమల అనిల్ కుమార్, ముత్తునూటి హరీష్, కుంట తిరుపతి, కొండల్ రెడ్డి, దొంతుల రమేష్, ర్యాకం శ్రీనివాస్, బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజు అడిచెర్ల, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, దూలం అనిల్, కలికోట మోహన్, కచ్చకాయల రాజు సతీష్, శశి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

