Mobile Popup Ad
Mobile Popup Ad

విజయ్ కు భారీ ఊరట.. మనసు మార్చుకున్న గవర్నర్

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. విజయ్ (Vijay) ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించిన వేళ ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ కేరళ పర్యటనకు సిద్ధమయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ కు అపాయింట్‌మెంట్ ఇవ్వని గవర్నర్ తాజాగా తన మనసు మార్చుకున్నారు. కేరళ పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో సా. 6.30 గంటలకు విజయ్ కు అపాయింట్‌మెంట్ ఇచ్చారు.

కాగా, తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లతో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే విజయ్ రెండో స్థానాల్లో గెలుపొందారు. దీంతో టీవీకే సంఖ్యాబలం 107కి పడిపోగా.. టీవీకేకు కాంగ్రెస్ (5), వాపపక్షాలు (4) మద్దతు ఇచ్చాయి. దీంతో మూడోసారి గవర్నర్ తో విజయ్ భేటీ సమయంలో 116 మంది మద్దతు లేఖలు సమర్పించారు. మరో రెండు సీట్ల కోసం ప్రమాణ స్వీకారం ఆగిపోయింది. శనివారం 2 సీట్లు ఉన్న వీసీకే, అలాగే 2 సీట్ల ఉన్న ఐయూఎంల్ పార్టీలు టీవీకేకు మద్దతు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి విజయ్ కు లైన్ క్లియర్ అయింది. ఇక గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విజయ్ ప్రమాణ స్వీకారం తేదీపై అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>