ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగు నీరు: ఎమ్మెల్యే మేఘారెడ్డి

కలం, వనపర్తి: వనపర్తి నియోజకవర్గ పరిధిలోని ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగు నీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే మేఘారెడ్డి (MLA Megha Reddy) తెలిపారు. నియోజకవర్గంలో సాగు నీటి సమస్యలు, పెండింగ్‌ పనులు, కొత్త ప్రతిపాదనలపై శనివారం హైదరాబాద్‌లోని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఛాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. అనివార్య కారణాల వల్ల మంత్రి ఉత్తమ్‌ హాజరు కాలేకపోవడంతో ఎమ్మెల్యే మేఘారెడ్డి అధికారులతో చర్చించారు.

పెండింగ్‌లో ఉన్న సాగునీటి పనులకు సంబంధించి వారం రోజుల్లో సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి అధికారులకు సూచించారు. రిపోర్ట్ అందిన వెంటనే వాటిని మంత్రి ఉత్తమ్‌ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్తామన్నారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ సీఈ రహీమ్‌ద్దీన్‌, ఎస్‌ఈ చంద్రశేఖర్‌, డీసీ వెంకట్‌రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>