ఫీజు బకాయిలు విడుదల చేయాలి: భరత్ ప్రసాద్

కలం, జోగులాంబ‌ గద్వాల: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్ (Bharath Prasad), జిల్లా యువ నాయకురాలు డీకే స్నిగ్ధా రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఫీజు బకాయి..బీజేపీ లడాయి అనే నినాదంతో గద్వాలలో‌ ఎంఏఎల్‌డి కళాశాల‌ నుంచి రాజీవ్ మార్గ మీదుగా పాత బస్టాండ్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో‌ వారు మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌ షిప్‌లు పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతి విద్యార్థి కి స్కాలర్‌ షిప్‌లు అందించి ఉన్నత చదువులు చదువుకునే విధంగా చూస్తామని హామీ ఇచ్చి నెరవేర్చడం లేదన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని, ప్రభుత్వం స్పందించే వరకు ప్రజా స్వామ్య బద్ధమైన ఆందో ళనలు కొన సాగిస్తామని స్పష్టం చేశారు

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్ర రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట్రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ ఎక్బోటే, శ్యామ్ రావ్, జిల్లా మహిళ మోర్చా అధ్యక్షుడు సమత గౌడ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు కిష్టాన్న, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దాస్,పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ నరసింహులు, కౌన్సిలర్లు శాలన్న, చంద్ర శేఖర్, మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి, శ్రీనివాసులు, తిమ్మా రెడ్డి, అక్బర్ పాషా, బీజేవైఎం నాయకులు పాండు, గాంజ సాయి,సతీష్, పవన్,అశోక్, తిరుమల్,శివ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>