Mobile Popup Ad
Mobile Popup Ad

మిలిటెంట్లను తయారు చేస్తున్నారా..? ఫాతిమా విద్యాసంస్థలపై బండి అనుమానం

కలం, వెబ్​ డెస్క్​ : ఎంఐఎం నేత అక్భరుద్ధీన్​ వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్​ (Bandi Sanjay Kumar)​ ఫైర్​ అయ్యారు. ఒవైసీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫాతిమా విద్యాసంస్థ గతంలో మిలిటెంట్లకు షెల్టర్​ ఇచ్చింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. చదువు చెప్పే ముసుగులో అక్కడ మిలిటెంట్లను తయారు చేస్తున్నారా? అని బండి అనుమానం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్​ ప్రభుత్వం అండతోనే ఒవైసీ బ్రదర్స్ బరితెగించి మాట్లాడుతున్నారని ఆయన (Bandi Sanjay Kumar) ఆరోపించారు. చివరికి హైకోర్టును బెదిరించేలా అక్భరుద్దీన్​ వ్యాఖ్యలు ఉండడం దారుణమన్నారు. ఎంఐఎం నేతలకు కోర్టులు అన్నా.. చట్టాలు అన్నా లెక్కలేదన్నారు. ఫాతిమా విద్యా సంస్థల ఇష్యూపై ప్రభుత్వం ఎందుకు మాట్లాడడం లేదని బండి నిలదీశారు.

గండిపేట ఎఫ్టీఎల్​ పరిధిలోని విద్యా సంస్థలకు నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం.. ఫాతిమా విద్యా సంస్థల జోలికి ఎందుకు వెళ్లడం లేదని బండి సంజయ్​ ప్రశ్నించారు. ఒవైసీకి ఒక న్యాయం.. ఇతరులకు ఒక న్యాయమా అని బండి సంజయ్​ విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఫాతిమా కాలేజీని కూల్చివేస్తామని ఆయన ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>