Mobile Popup Ad
Mobile Popup Ad

వయాగ్రా వాడుతున్న ఆటగాళ్లు.. ఇంగ్లండ్ క్లారిటీ

కలం, స్పోర్ట్స్: ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా మెక్సికోతో జరిగే ప్రీక్వార్టర్ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ (England) జట్టుపై వచ్చిన వయాగ్రా వార్తలు చర్చకు దారితీశాయి. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని జట్టు కోచ్ థామస్ టుచెల్, సీనియర్ మిడ్‌ ఫీల్డర్ జోర్డాన్ హెండర్సన్ స్పష్టం చేశారు.

మెక్సికో సిటీలోని ఎత్తయిన ప్రాంత పరిస్థితులకు తట్టుకునేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్లు వయాగ్రా వాడుతున్నారనే వార్తలు వెలువడ్డాయి. ఈ ఔషధంపై ప్రపంచ యాంటీ డోపింగ్ సంస్థ నిషేధం లేకపోవడంతో ఆ ప్రచారం మరింత విస్తరించింది.

సరదాగా చెప్పి ఉంటారు..

మ్యాచ్‌కు ముందు టుచెల్ మీడియాతో మాట్లాడుతూ.. వయాగ్రా వాడుతున్నట్లు సమాచారం తమ వద్ద లేదని, ఆ వార్తలు నిజం కాదని చెప్పారు. తర్వాత హెండర్సన్ కూడా స్పందిస్తూ.. సరదాగా వయాగ్రా ఉపయోగపడినట్లు చెప్పి ఉంటారని.. వెంటనే అది కేవలం జోక్ మాత్రమేనని స్పష్టం చేశాడు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని తెలిపాడు.

మెక్సికో సిటీలోని ఎత్తయిన ప్రాంత ప్రభావం మాత్రం ఆటగాళ్లకు అనిపిస్తోందని హెండర్సన్ వెల్లడించాడు. అక్కడికి చేరుకున్న వెంటనే నడిచేటప్పుడు కూడా కొంత తేడా కనిపించిందని చెప్పాడు.

అక్కడ ఆక్సిజన్ తక్కువ..

తొలి ప్రాక్టీస్‌లో మొదటి 10 నుంచి 15 నిమిషాల వరకు ఆ ప్రభావం ఉన్నప్పటికీ, తర్వాత శిక్షణపై దృష్టి పెట్టడంతో అలవాటు పడినట్లు వివరించాడు. మెక్సికో సిటీలోని ఎస్టాడియో అజ్టెకా స్టేడియం సముద్ర మట్టానికి సుమారు 7,220 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడ గాలిలో ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల ఆటగాళ్ల శరీరంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆతిథ్య మెక్సికోతో ఇంగ్లండ్ ప్రీక్వార్టర్ మ్యాచ్ ఆడనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>