కలం మెదక్ బ్యూరో: మిషన్ భగీరథ నీరు రావడం లేదంటూ, తాగు నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మెదక్ (Medak) జిల్లాలో మహిళలు ఆందోళన నిర్వహించారు. చిన్న శంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామంలో నాలుగు రోజులుగా నీరు సరఫరా కావడం లేదు. దీంతో నార్సింగి- మిర్జాపల్లి రహదారిపై తో పిల్లాపాపలతో వర్షంలోనే ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
తాగునీటి సమస్య గురించి చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సమస్య పరిష్కరించే వరకు కదిలేది లేదంటూ బైఠాయించారు. విషయం తెలుసుకున్న సర్పంచి సునీత యాదగిరి, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్ సహకారంతో బోరు వేయించి నీటి సమస్య తీరుస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

