కలం, నిజామాబాద్ బ్యూరో : మున్సిపాలిటీలో బోగస్ ఓట్లు తొలగించాలని కామారెడ్డి (Kamareddy) లో బీజేపీ పోరుబాట పట్టింది. బీజేపీ నిర్వహించిన కామారెడ్డి మున్సిపల్ కార్యాలయ ముట్టడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముసాయిదా ఓటర్ జాబితాలో ఓటర్ల గల్లంతు భారీగా జరిగిందని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ ను ముట్టడించారు.
అయితే కార్యాలయం ఎదుట గేట్లను తోసుకుంటూ లోపలికి చొచ్చుకెళ్లేందుకు నాయకులు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఓటరు జాబితాలో తప్పులను సవరించాలని బోగస్ ఓట్లను, స్థానికేతరులను తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: సచివాలయం @ కమాండ్ కంట్రోల్
Follow Us On : WhatsApp


