కలం, కరీంనగర్ బ్యూరో : ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించడానికి ఐఏఎస్ ఆఫీసర్ చేసిన పని అందరి ప్రశంసలు అందుకుంటోంది. కరీంనగర్ (Karimnagar) మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పని పని చేస్తున్న ప్రఫుల్ దేశాయ్ (IAS Praful Desai) తన సతీమణి ప్రసవం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలోని మాతాశిశు కేంద్రంలో ఆదివారం జాయిన్ చేయించారు. సోమవారం గైనకాలజిస్టుల పర్యవేక్షణలో ఆమెకు ఆపరేషన్ చేసి.. డెలివరీని విజయవంతంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ సతీమణి పండంటి పాపకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. ఐఏఎస్ అధికారిగా ఉన్న ప్రపుల్ దేశాయ్ తన భార్యకు సర్కార్ ఆసుపత్రిలో చికిత్స అందించడాన్ని పలువురు అభినందిస్తున్నారు.
Read Also: రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. ఆ నిధులు విడుదల
Follow Us On: Sharechat


