Mobile Popup Ad
Mobile Popup Ad

మండెలగూడెంలో రైతుల సమస్యలపై బీజేపీ, బీఆర్ఎస్ నిరసన

కలం, రఘునాథపల్లి : ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రఘునాథపల్లి మండలం మండెలగూడెంలోని (Mandelagudem) ఐకేపీ కేంద్రం వద్ద బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు పుప్పల వేణు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చింతకింది బాలకృష్ణ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.

కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం తీసుకువచ్చి సుమారు రెండు నెలలు గడిచినా ఇప్పటికీ కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి తరలించాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ ఘటనతో ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

Read Also: ట్విషా శర్మ ఆత్మహత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం

Read Also: పెట్రో బాదుడు పాపం తలా పిడికెడు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>