కలం, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోన్న హీరోయిన్ ట్విషా శర్మ (Twisha Sharma) ఆత్మహత్య కేసును సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్విషా అత్త, మాజీ జడ్జి గిరిబాలాసింగ్‌ను అరెస్ట్ చేసి, భోపాల్ కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అంతకుముందు, గిరిబాలాసింగ్ ఇంట్లో గంటల కొద్దీ సీబీఐ అధికారులు సోదాలు చేశారు. ట్విషా శర్మ కాల్ డేటా, గిరిబాలాసింగ్ కాల్ డేటాను సంపూర్ణంగా విశ్లేషిస్తున్నారు. డిజిటల్ మ్యాపింగ్‌తో ట్విషా శర్మ చనిపోయిన సమయంలో గిరిబాలాసింగ్ ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.
ట్విషా శర్మ ఆత్మహత్య.. అసలేం జరిగింది..?
నోయిడాకు చెందిన ట్విషా శర్మ (Twisha Sharma) మోడల్, హీరోయిన్. గత నెల 12న లాయర్ సమర్థ్ సింగ్‌తో ఆమెకు ఘనంగా వివాహం జరిగింది. పెళ్లయి నెల రోజుల కాకముందే, ట్విషా శర్మ తన రూంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. మొదట ఇది ఆత్మహత్య కేసుగా భావించినా.. అత్తింటి వేధింపులే కారణమని ట్విషా కుటుంబసభ్యులు ఆరోపించారు. అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు గర్భస్రావం చేయించుకోవాలని ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నారు. దీంతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. విచారణ జరిపిన కోర్ట్, దర్యాప్తును సీబీఐకి అప్పగించింది.
Read Also: లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
Read Also: పెట్రో బాదుడు పాపం తలా పిడికెడు

