Mobile Popup Ad
Mobile Popup Ad

వడ్డెపల్లి మున్సిపాలిటీ ‘హస్త’గతం!.. సీఎంను కలిసిన AIFB కౌన్సిలర్లు

కలం, వెబ్​ డెస్క్​ : జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ (Waddepally Municipality) లో గెలిచిన 8 మంది ఆల్ ఇండియా ఫార్వార్డ్​ బ్లాక్ (AIFB) అభ్యర్థులు కాంగ్రెస్​లో చేరారు. సీఎం రేవంత్​ రెడ్డిని వడ్డేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలోని కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి సీఎం కాంగ్రెస్​ కండువాలు కప్పారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ జిల్లెల చిన్నారెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, తదితరులు హాజరయ్యారు.

సీఎంను కలిసిన వడ్డెపల్లి మున్సిపల్ (Waddepally Municipality)​ కౌన్సిలర్లలో కుర్వ పావని, శారద, మంజుల, యుగేందర్​ రెడ్డి, దేవమ్మ, విజయ్​ భాస్కర్​, జయశ్రీ, ఎరుకల తమ్మప్ప ఉన్నారు. కాగా, వడ్డేపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్​ ఖాతాలో చేరడంతో మొత్తం 67 మున్సిపాలిటీలు హస్తగతమవుతాయి. అయితే, జాగృతి అధ్యక్షురాలు కవిత మద్ధతుతోనే ఏఐఎఫ్​ బీ అభ్యర్థులు గెలిచారంటూ వచ్చిన వార్తలను ఆ పార్టీ నాయకుడు వడ్డెపల్లి శ్రీనివాస్​ ఖండించిన విషయం తెలిసిందే.

Read Also: వింటర్​ ఒలింపిక్స్​లో కండోమ్స్​ కొరత.. 72 గంటల్లో 10 వేలు ఖాళీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>