బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. పోలింగ్ తేదీలు, ఇతర వివరాలను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్(Gyanesh Kumar) వెల్లడించారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 22లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుందని ఆయన వివరించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణ.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నికను కూడా నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. నామినేషన్ల కంటే 10 రోజుల ముందు వరకు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవచ్చని చెప్పారు.
బీహార్(Bihar) అసెంబ్లీకి నవంబర్ 22తో గడువు ముగుస్తుంది. ఆలోపే ఎన్నికల ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. ఛట్‌పూజ ముగిసిన వెంటనే పోలింగ్ జరిగేలా చూడాలని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాయి.

