కలం డెస్క్: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు. వరుసగా సక్సెస్ సాధిస్తూ దూసుకెళుతున్న అనిల్ రావిపూడి ఈ మూవీని తెరకెక్కిస్తుండడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతికి జనవరి 12న ఈ క్రేజీ మూవీ రిలీజ్ కానుంది. అయితే.. ఈ సినిమా తర్వాత చిరు చేసే సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. ముఖ్యంగా చిరు, శ్రీకాంత్ ఓదెల(Chiranjeevi – Srikanth Odela) మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఈ భారీ, క్రేజీ మూవీ పట్టాలెక్కేది ఎప్పుడు..?
మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ తర్వాత చిరంజీవి.. బాబీతో ఓ భారీ చిత్రం.. శ్రీకాంత్ ఓదెలతో ఓ భారీ చిత్రం చేయనున్నారు. ఈ రెండు సినిమాలను అధికారికంగా ప్రకటించారు కానీ.. అంతకు మించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ముందుగా డైరెక్టర్ బాబీతో సినిమాని పట్టాలెక్కించనున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ రిలీజ్ తర్వాత బాబీతో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. గతంలో చిరు, బాబీ కలిసి వాల్తేరు వీరయ్య సినిమా చేయడం.. అది బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. ఈసారి అంతకు మించిన సక్సెస్ సాధించాలనే పట్టుదలతో బాబీ వర్క్ చేస్తున్నారని తెలిసింది.
2026 ద్వితీయార్ధంలో.. చిరు, శ్రీకాంత్ ఓదెల(Chiranjeevi – Srikanth Odela) మూవీని స్టార్ట్ చేయనున్నారని సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ లుక్ తోనే ఈ సినిమా పై అంచనాలు పెంచేశారు. ఇప్పటి వరకు చిరంజీవి వచ్చిన సినిమాలకు భిన్నంగా.. చాలా వయలెంట్ గా ఉండబోతుందని ఫస్ట్ లుక్ ని బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల నానితో ప్యారడైజ్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో నానిని కొత్త పాత్రలో చూపిస్తున్నాడు. అది ఎలా ఉంటుందంటే.. సినిమా చూసిన జనాలు షాక్ అయ్యేలా డిజైన్ చేశాడట. ఇక మెగాస్టార్ తో చేసే సినిమా అయితే.. వేరే లెవల్లో ఉంటుందట. మరి.. మెగాస్టార్ కోసం ఎలాంటి స్టోరీ రెడీ చేసాడో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Read Also: సీతాఫలం ఎంత అండర్‌రేటెడ్ ఫ్రూటో తెలుసా?
Follow Us On: X(Twitter)


