కలం డెస్క్: ఎనర్జిటిక్ హీరో రామ్ (Ram Pothineni).. ఈమధ్య కెరీర్ లో బాగా వెనకబడ్డాడు. ఇస్మార్ట్ శంకర్ మూవీతో మాస్ లో మాంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. అయితే.. ఆ తర్వాత నుంచి చేసిన మాస్ ప్రయత్నాలు ఫలించలేదు. రెడ్, వారియర్, స్కంధ, డబుల్ ఇస్మార్ట్ అంటూ చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. అందుకనే ఈసారి కాస్త క్లాస్ టచ్ తో ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా చేశాడు. దీనికి బాగుందనే టాక్ వచ్చింది కానీ.. ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఈ కారణంగానే నెక్ట్స్ మూవీ విషయంలో రూటు మార్చినట్టు తెలిసింది. ఇంతకీ.. రామ్ రూటు మార్చి రామ్ ఏం చేయబోతున్నాడు..?
ఇప్పటి వరకు చేసిన మాస్ ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. ఇక నుంచి రూటు మార్చి డిఫరెంట్ గా ఉన్న సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడట. నెక్ట్స్ హర్రర్ థ్రిల్లర్ చేయాలని డిసైడ్ అయ్యాడని టాక్ వినిపిస్తోంది. అది కూడా కొత్త దర్శకుడితో రామ్ ఈ ప్రయత్నం చేయబోతుండడం విశేషం. కిషోర్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాను బాహుబలి ప్రొడ్యూసర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. దీనికి సంబంధంచిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతంది. కొత్త సంవత్సరంలో ఈ సినిమాని పట్టాలెక్కించనున్నారని సమాచారం.
ఆంధ్ర కింగ్ తాలూకా (Andhra King Taluka) సినిమా పై రామ్ (Ram Pothineni) చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే.. ఈ సినిమా దాదాపు 56 కోట్లతో తీస్తే.. 34 కోట్లు మాత్రమే వచ్చింది. బాగుందనే టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు.. హిట్ అనిపించుకోలేదు. ఇంకా చెప్పాలంటే.. ఈ సినిమా రిజెల్ట్ రామ్ ని బాగా నిరాశపరిచిందట. దీంతో ఏ జోనర్ లో సినిమా చేయాలి అనేది తేల్చుకోలేకపోతున్నాడట. ఈసారి హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఆతర్వాత చేసే సినిమాను కూడా ఇంత ముందు చేయని జోనర్ లో చేయాలి అనుకుంటున్నాడట. మరి.. రూటు మార్చిన రామ్ కు ఈ సినిమా అయినా సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి.
Read Also: పెద్ది – ది ప్యారడైజ్.. పోటాపోటీగా అప్డేట్లు
Follow Us On: Pinterest


